TGPSC | నవంబర్ 17, 18న గ్రూప్-3 పరీక్షలు
TGPSC | నవంబర్ 17, 18న గ్రూప్-3 పరీక్షలు
నవంబర్ 10 నుంచి హాల్‌టిక్కెట్ల జారీ ప్రారంభం
రోజు రెండు పూటలూ పరీక్షలు
Hyderabad : రాష్ట్రంలో గ్రూప్-3 పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష తేదీలు ఖరారు చేస్తు బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఒక్క రోజులో రెండు పూటలూ నిర్వహించనున్నారు. నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. అలాగే పేపర్-3 నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు నిర్వహిస్తారు. అయితే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్ 10 నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు టీజీపీఎస్సీ సెక్రెటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలి. వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే 1,388 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నట్లు గతంలో టీజీపీఎస్సీ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 10 నుంచి హాల్‌టిక్కెట్ల జారీ ప్రారంభం
రోజు రెండు పూటలూ పరీక్షలు
* * *
Leave A Comment